భువనేశ్వర్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో షాట్‌పుటర్ తజిందర్పాల్సింగ్ తూర్ పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల షాట్‌ఫుట్‌లో తజిందర్‌పాల్ ఇనుపగుండును 20.38మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఇది తన వ్యక్తిగత మార్క్(21.77మీ)తో పాటు ఒలింపిక్ క్వాలిఫయింగ్(21.50మీ) కంటే తక్కువ కావడం విశేషం. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ అల్డ్రిన్ 7.99మీటర్ల దూరంతో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు.