ముషీరాబాద్, మే 14: సగర ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో సగర ఉప్పర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీరడి భూపేష్ సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన భగీరథ జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సగరులను బీసీడీ నుంచి గ్రూప్-ఏలోకి మార్చాలని, ప్రతి సగర కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సగర కార్పొరేషన్‌కు 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, చట్ట సభల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా ఉన్న సగరులకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, విజయేంద్ర సాగర్, హనుమంతు సాగర్, పార్థసారథి, జనార్దన్, నందగోపాల్, అనంతయ్య, జయంతి, ఉదయ్, నిఖిల్, హేమంత్ పాల్గొన్నారు.