అస్తానా: ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ గౌరవ్ చౌహాన్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేశాడు. మంగళవారం 92 కిలోల విభాగంలో పోటీపడ్డ గౌరవ్.. 3-2 తేడాతో డేనియల్ సపర్బె (కజకిస్థాన్)తో పోరాడి గెలిచాడు. కానీ ఆరుసార్లు ఆసియా చాంపియన్‌షిప్ విజేత శివ తాపా (63.5 కిలోలు) 1-4తో అబ్దుల్ అల్మత్ (కజకిస్థాన్) చేతిలో ఓడగా సంజయ్ (80 కిలోలు) కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు.