Karmastalam | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ దివి వైద్య (Divi Vadthya). మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ఫాదర్తోపాలు పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్‌లో కూడా మెరిసింది. ఇప్పటిదాకా గ్లామర్ టచ్ ఇచ్చిన దివి ఈ సారి అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. దివి లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కర్మ స్థలం (Karmastalam). రాకీ షర్మన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
దివి యోధురాలిగా కదనరంగంలోకి దిగి పోరాడుతున్న అగ్రెసివ్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. బ్యాక్ గ్రౌండ్లో అగ్నికీలలు మధ్య సైన్యాన్ని చూడొచ్చు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, అర్చనా శాస్త్రి కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, మిథాలి చౌహాన్‌తోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్షవర్దన్ షిండే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుని హై స్టాండర్డ్ విజువల్స్‌తో సినిమాను రూపొందిస్తున్నట్టు ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ రాకీ షర్మన్.
The Stunning @DiviActor is absolutely ferocious as the lone warrior rising against the Destroyers in the first look of #Karmastalam
Get ready for an epic saga! pic.twitter.com/GUbKxDF1sq
— Telugu Film Producers Council (@tfpcin) December 9, 2025
Karthi | హిట్ 4 ఎప్పుడు.. కార్తీ ప్రశ్నకు డైరెక్టర్ శైలేష్ కొలను ఏం చెప్పాడంటే..?
Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్9లో ఊహించని ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఒక ఎలిమినేషన్ ?
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!