Distributor Harish Sajja | టాలీవుడ్ సినిమాలను అమెరికాలో పంపిణీ చేస్తూ ప్రముఖ పంపిణీదారుడుగా పేరుగాంచిన హరీష్ సజ్జా సోమవారం ఉదయం అమెరికాలో మరణించారు. అట్లాంటాలో నివాసం వుంటున్న ఆయన అక్కడ గుండెపోటుతో మృతిచెందాడు.
దూకుడు చిత్రంతో హిట్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరుపొందాడు హరీష్ సజ్జా. తెలుగు సినిమాలను అమితంగా ఇష్టపడే ఆయన దాదాపుగా హిట్ సినిమాలను అమెరికాలో పంపిణీ చేశాడు. రాఖీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన హరీష్ సజ్జా, సూపర్‌హిట్ చిత్రాలైనా రాఖీ, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రోబో, రేసు గుర్రం, నేనొక్కడినే, ఆగడు, జనతా గ్యారేజి తదితర సినిమాలను తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫికాసో సంస్థ ద్వారా పంపిణీ చేశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులతో పాటు అమెరికా పంపిణీదారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Also Read..