NRI | లండన్‌లో ఘనంగా ‘టాక్ బోనాల జాతర’ వేడుకలు
NRI | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో(London) బోనాల జాతరను(Bonalu celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి భారీగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో(London) బోనాల జాతరను(Bonalu celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి భారీగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల,ఉపాధ్యక్షుడు శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు వ్యాఖ్యాతగా సత్యమూర్తి చిలుముల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ మహ్మద్ షకీల్ అక్రమ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహ్మద్ షకీల్ అక్రమ్ మాట్లాడుతూ యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు. ప్రముఖ నృత్య కళాకారిణి రాగసుధ వింజమూరి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిళ్లర్లు అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, ఆదేశ్ ఫర్మాహాన్, బంధన చోప్రా,
అశోక్ దూసరి, మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, జాహ్నవి వేముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, రాకేష్ పటేల్, సత్యపాల్, మల్లా రెడ్డి, గణేష్ కుప్పాల, సత్యం కంది, శ్రీకాంత్ జెల్ల, శ్రీధర్ రావు, మధుసూదన్ రెడ్డి, శైలజ జెల్ల,స్నేహ, శ్వేతా మహేందర్, స్వాతి, క్రాంతి, పవిత్ర, సుప్రజ, శ్వేత, శ్రీ విద్య, నీలిమ, పృధ్వీ, మణి తేజ, గణేష్ పాస్తం, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, నవీన్ రెడ్డి, కార్తీక్, రంజిత్, రాజేష్ వాక, మహేందర్, వంశీ,ఆనంద్, అక్షయ్, పావని, జస్వంత్, శివ వెన్న, నాగ్, మాడి, వినోద్, సన్నీ, సందీప్, తదితరులు పాల్గొన్నారు.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

