Dil raju Selfish Movie | శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇక రాజు గారి సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చి హీరోగా తెరకు పరిచయం అయ్యాడు. శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో హీరోగా నటించిన మొదటి చిత్రం రౌడీ బాయ్స్.
ఈ చిత్రంతో మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు ఆశిష్. దిల్ రాజు తన సొంత సంస్థ శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో ఆశిష్ హీరోగా ‘సెల్ఫిష్'(Selfish) అనే రెండో చిత్రం మొదలు పెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు కాశీ ఇతను పాన్ ఇండియా దర్శకుడైన సుకుమార్ శిష్యుడు. సెల్ఫిష్ సినిమా పాత బస్తీ నేపథ్యంలో కొనసాగే కథ. అయితే నిర్మాత దిల్ రాజు కొన్ని రోజులు షూటింగ్ తరువాత కథలో మార్పులు చేయాలని ప్రాజెక్ట్ ను ఆపేశారు. ఈ సమయంలోనే ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా అరుణ్ భీమవరపు రూపొందించిన `లవ్ మీ` అనే రొమాంటిక్ హారర్ సినిమాను పూర్తి చేసి విడుదల కూడా చేశారు. ఈ చిత్రం కూడా ఆశిష్ కెరీర్లో డిజాస్టర్ గా మిగిలిపోయింది.
దిల్ రాజు ఆశిష్ కోసం తన టీమ్ తో ఎన్నో కథలు వింటున్నా ఏ కథ నచ్చలేదట. అయితే ముందుగా కొన్ని రోజులు షూటింగ్ జరుపుకొని ఆపేసిన సెల్ఫిష్ దర్శకుడు కాశీ కథలో చేసిని మార్పులు నచ్చి మళ్ళీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఇందులో ఆశిష్ మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ద్వారా ఆశిష్‌కు మంచి హిట్ అందుకోబోతున్నాడని నమ్ముతున్నారు. దీంతో ఆగిపోయిన దిల్ రాజు సినిమా మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా రూపొందుతోంది. దీనితో పాటు అనిల్ రావిపుడి – వెంకటేశ్ కాంబోలో మరో సినిమా రాబోతుంది.
Also Read..