Disha Mouni | సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే అతి కొద్ది మంది భామల్లో టాప్‌లో ఉంటుంది దిశాపటానీ (Disha Patani). ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బ్రహ్మా్స్త్ర లాంటి భారీ ప్రాజెక్టుతో బిగ్ స్క్రీన్‌పై మెరిసింది టీవీ నటి మౌనీరాయ్ (Mouni Roy). ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సూర్యతాపంలో బీచ్‌లోని ఇసుక తిన్నెల్లో ఒకరి చేయి మరొకరు పట్టుకుని చిల్ అవుట్ అయ్యారు.
దిశా పటానీ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. నా ప్రకాశవంతమైన స్టార్ మోంజు (మౌనీరాయ్)కోసం ఎప్పటికీ గుర్తుండిపోయే సంతోషకరమైన పుట్టినరోజు. నా జీవితంలో చాలా ఆనందాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు. నా సోదరి ప్రేమతో.. అని క్యాప్షన్ పెట్టింది. దీనికి మౌనీరాయ్ స్పందిస్తూ.. నువ్వు చేసే ప్రతి పనికి కృతజ్ఞతలు.. నా లిటిల్ వన్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దిశా పటానీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య నటిస్తోన్న కంగువలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. మరోవైపు వెల్ కమ్ టు ది జంగిల్లో నటిస్తోంది. మౌనీ రాయ్ ప్రస్తుతం The वरGIN Tree లో నటిస్తోంది.
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?