సాధారణంగా శంకర్ లాంటి క్రేజీ దర్శకుడు రూపొందించిన బాయ్స్, జీన్స్ ,జెంటిల్ మెన్ ,శివాజీ, అపరిచితుడు,రోబో,రోబో 2.ఓ,భారతీయుడు వంటి పలు చిత్రాలు ఘన నీయమైన విజయాలను సాధించాయి. ఆయన చిత్రీకరించే సినిమాలన్నీ మెసేజ్ ఓరియేంటెడ్ గా ఉంటాయి. ఆయన చేసే ప్రతి చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. సినిమా చూసే ప్రేక్షకులకు ఏదో ఒక మెసేజ్ ని ఇస్తారు దర్శకుడు శంకర్. ఇదే విధంగా 28 సంవత్సరాల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రంలో కూడా సమాజంలో జరుగుతున్న అవినీతి ,అన్యాయాలను ఎలా అరికట్టాలో తెలియజేశారు.
అయితే ఇటీవల విడుదలైన కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో నిర్మించిన భారతీయుడు-2 (Bharateeyudu 2) చిత్రం భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులకు అడుగడుగునా అసంతృప్తినిచ్చింది. ఈ చిత్రం అంచనాలను అందుకోలేక పోగా చాలా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా చాలా వీక్ టాక్ ను సొంతం చేసుకుంది. తరువాత సినిమా బోర్ గా ఉందని ,సినిమా నిడివి మూడు గంటలు మైనస్ అని చెప్పడంతో.. నిర్మాతలు సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించమని చెప్పారు.
అయితే తీరా చూస్తే సినిమా మూడు గంటల నిడివి అలాగే ఉంది. థియేటర్లలో అయితే సినిమా సమయంను తగ్గించడానికి శంకర్ (Shankar) ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ట్రిమ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీలేదు. సినిమా ఇప్పుడు కట్ చేయడం వలన సినిమా ఫ్లో, స్క్రీన్ ప్లే, దెబ్బతింటుంది అని శంకర్ వాదించారట. నిడివి తగ్గించడానికి అస్సలు ఒప్పుకోలేదు శంకర్, ఒక విధంగా ఆయన చేసింది కరెక్టే అంటున్నారు. ఎందుకంటే ఒక్క సారి సినిమా విడుదలై న తరువాత నిడివి తగ్గించే ప్రయత్నం చేసినా ఆ సినిమాకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకవేళ ఆ చిత్రాన్ని కట్ చేస్తే ఆ సినిమా ఫెయిల్యూర్ అయినట్టేనని కొంత మంది అభిప్రాయం.
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!
SIIMA 2024 | సైమా 2024లో దసరా, జైలర్ హవా.. ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయ్యాయంటే..?