Sandeep Reddy Vanga | అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సందీప్ తన గ్యారేజ్‌లోకి ఆకుపచ్చ రంగులో ఉన్న సరికొత్త మినీ కూపర్ కారును కొన్నాడు. ఈ కారుకు పూజలు చేయించి, బయటకు తీస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ కొనుగోలు చేసిన ఈ మినీ కూపర్ మోడల్ ‘కూపర్ S’ లేదా ‘JCW’ అయి ఉంటుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మోడల్ ధర సుమారుగా రూ. 50 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కథానాయికగా నటించబోతుంది.
Director #SandeepReddyVanga Bought New car MiniCooper pic.twitter.com/fdvjNoPtPV
— Filmy Bowl (@FilmyBowl) June 19, 2025
Read More