Hanmakonda Court | హైదరాబాద్ : హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపుల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు డిటోనేటర్లు లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాదులు, లాయర్లు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోర్టులో బాంబు పెట్టినట్లు డయల్ 100కు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి చెప్పాడు.