మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 20 : మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఆర్ అండ్ బీ అధికారులతో సంప్రదించి ప్రతిపాధనలు సిద్ధం చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న ఎస్సీ, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని హాస్టల్ అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ సెంటర్‌ను, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు.
అనంతరం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమయం చాలా విలువైనదని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెక్నికల్ ట్రేడ్లు చేసిన వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.వినోద్ కుమార్, ఐఎన్టీయూసీ రాములు యాదవ్, ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు పాల్గొన్నారు.
Mahaboobnagar : జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే యెన్నం