‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మంగళవారం’ సినిమా కూడా ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఓ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు అజయ్ భూపతి. ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరును పరిశీలిస్తున్నారు. తిరుపతికి చేరువలో ఉండే గ్రామం శ్రీనివాస మంగాపురం. ఆ గ్రామంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తున్నది.
స్వర్గీయ ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు, సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా ఇందులో కథానాయిక. ఈ కథలో ప్రతినాయకుడి పాత్ర కీలకం. అందుకోసం ఓ సీనియర్ నటుడ్ని సంప్రదించినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.