ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రాంచరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ (RRR). మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈచిత్రం ముందుగా అంచనా వేసినట్టుగా రికార్డుల వేట కొనసాగిస్తూ..తన హవా చూపిస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను దిల్ రాజు ( Dil Raju) తీసుకున్నారు. నైజాంలో మంచి వసూళ్లతో సక్సెస్ఫుల్ ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో దిల్ రాజు ఆర్ఆర్ఆర్ టీంకు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ టీంతోపాటు టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సక్సెస్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలపై మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ట్రిపుల్ ఆర్‌ను డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్టు రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమ్రంభీంగా అద్బుతమైన నటనను కనబరిచారు.
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత పాత్రలో నటించింది. హాలీవుడ్ భామ ఒలివియా మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది.