టాలీవుడ్ (Tollywood)లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లలో టాప్‌లో ఉంటారు దిల్ రాజు (Dil Raju). ఈ నిర్మాత కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఎప్పటికపుడు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకునే ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కు రెండు సినిమాలు మాత్రం నష్టాలను మిగిల్చాయట.
ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏమై ఉంటాయనే కదా మీ డౌటు. రెండు చిత్రాలు తెలుగులో హిట్టయి, హిందీ రీమేక్ అయిన జెర్సీ (Jersey) , హిట్ (HIT). జెర్సీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించారు.
ఈ సినిమాల వల్ల వచ్చిన నష్టాల గురించి చిట్‌చాట్‌లో మాట్లాడారు దిల్ రాజు. ‘షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ మంచి హిట్టు అందుకున్న తర్వాత జెర్సీ హిందీ వెర్షన్ లాంఛ్ చేసినపుడు రూ.30 కోట్ల వరకు లాభాలు వస్తాయనుకున్నాం. కానీ కోవిడ్ -19 ప్రభావంతో సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అప్పటికీ ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలకు బాలీవుడ్ మార్కెట్ సిద్దంగా లేదు. రిలీజయ్యాక లాభాల మాటే మార్చిపోయాం. 4-5 కోట్లు నష్టపోయామన్నారు’ దిల్ రాజు.
ఇక హిందీలో రెండో ప్రాజెక్టు హిట్ గురించి చెబుతూ..‘సాధారణంగా రాజ్‌కుమార్ రావు సినిమాలకు బాక్సాపీస్ వద్ద తొలి వీకెండ్లో రూ.15 కోట్లు వసూలు చేస్తాయి. కానీ ఈ సారి సీన్ రివర్సైంది. కేవలం 6 కోట్లు మాత్రం వసూళ్లు వచ్చాయి. ప్లాప్ టాక్ రావడంతో నష్టపోయామంటూ’ చెప్పుకొచ్చారు.
Read Also : Ritika Singh | ‘ఓ సక్కనోడా..నిన్ను పట్టేసుకుంటా’..రితికాసింగ్ వీడియో వైరల్