కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం వారిసు..ది బాస్ రిటర్న్స్ . తెలుగులో వారసుడు టైటిల్‌తో తెరకెక్కుతోంది. వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో వస్తోంది. కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో నేడు ప్రారంభమైనట్టు ఓ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇలా షూట్ చేయడంపై నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చారు. కాస్ట్ అండ్ క్రూ టీం ఏ తెలుగు సినిమాకు షూటింగ్ చేయడం లేదని, కేవలం తమిళ వెర్షన్ షూటింగ్ మాత్రమే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
విజయ్ 66వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్ కీ రోల్స్ చేస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.