Poonam Dhillon | బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) ఇంట్లో చోరీ జరిగింది. రూ.లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ (Diamond Necklace) సహా నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు 37 ఏళ్ల సమీర్ అన్సారీగా గుర్తించారు.
ముంబై (Mumbai)లోని ఖార్ (Khar) ప్రాంతంలో ఉన్న నటి నివాసానికి డిసెంబర్ 28 నుంచి జనవరి 5 మధ్య పెయింటింగ్ చేశారు (painting the flat). ఆ సమయంలోనే విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. ఫ్లాట్‌కు రంగులు వేసేకి వచ్చిన బృందంలో సమీర్ అన్సారీ కూడా ఉన్నాడు. ఒకరోజు ఇంటి అల్మారాను తెరిచి ఉండడం గమనించిన అన్సారీ.. అదే అవకాశంగా చోరీకి పాల్పడ్డాడు. రూ.లక్ష విలువైన డైమండ్ నెక్లెస్, రూ.35 వేల నగదు సహా కొన్ని విలువైన వస్తువులను అపహరించుకుపోయాడు. చోరీ అంశంపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చోరీకి పాల్పడింది సమీర్ అన్సారీగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read..
Actor Vishal | విశాల్‌కి ఏమైంది.. అసలు విషయం చెప్పిన నటి ఖుష్బూ
Jaragandi Song | గేమ్ ఛేంజర్‌లో ‘జరగండి’ సాంగ్ ఏఐతో చేశాం : థమన్
Saipallavi | మళ్లీ తెలంగాణ నేపథ్యంతో రాబోతున్న సాయిపల్లవి..!