Saipallavi | మళ్లీ తెలంగాణ నేపథ్యంతో రాబోతున్న సాయిపల్లవి..!
Saipallavi | తెలంగాణ సంస్కృతి, బంధాలు, భావోద్వేగాల నడుమ సాగే బలమైన కథతో ‘బలగం’ తీసి, భారీ హిట్‌ను అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి.. త్వరలో ‘ఎల్లమ్మ’ కథతో రానున్నారు. దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ కథానాయకుడు.
Saipallavi | తెలంగాణ సంస్కృతి, బంధాలు, భావోద్వేగాల నడుమ సాగే బలమైన కథతో ‘బలగం’ తీసి, భారీ హిట్‌ను అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి.. త్వరలో ‘ఎల్లమ్మ’ కథతో రానున్నారు. దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ కథానాయకుడు. కథానాయికగా సాయిపల్లవి దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. ఇటీవలే ఆమె కథ కూడా విన్నదట. ‘బలగం’ కథను మించిన ఎమోషన్స్ ‘ఎల్లమ్మ’లో ఉంటాయని తెలుస్తున్నది.
తెలంగాణ సంస్కృతిలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఎల్లమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, పోశమ్మ.. ఇలా విభిన్నమైన నామాలతో గ్రామదేవతలు దర్శనమిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ గంగానమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ.. ఇలా రకరకాల రూపాల్లో గ్రామదేవతలు పూజలందుకుంటున్నారు. ఈ గ్రామదేవతల నేపథ్యాన్ని తీసుకొని, వారిచుట్టూ తెలంగాణ నేపథ్యంలో దర్శకుడు వేణు యల్దండి ఈ కథ అల్లారని వినికిడి. అయితే.. ఇదేం భక్తిరసచిత్రం కాదు. ‘బలగం’లా ఇదికూడా భావోద్వేగాల ప్రయాణమే. సాయిపల్లవి ఓ సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా అది గొప్పదై ఉంటుందనేది పలువురి అభిప్రాయం. మరి ‘ఎల్లమ్మ’ కథ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ‘ఎల్లమ్మ’ టీమ్ బిజీగా ఉంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

