Vishal | తమిళ నటుడు విశాల్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఆయన మీడియా ముందుకి రాగా.. అతడి మొహం వాచి ఉండడం.. చేతులు వణకడం చూసి విశాల్ అభిమానులు కంగారుపడుతుండడంతో పాటు ఆందోళన చెందుతున్నారు. విశాల్ త్వరగా కోలుకొని ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రార్థిస్తున్నారు. అయితే అసలు విశాల్‌కి ఏమైంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది నటి ఖుష్బూ.
ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన చిత్రం ‘మదగజరాజ’. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను 12 ఏండ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ ప్రమోషన్స్ నిర్వహించగా.. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు విశాల్ బయటకు వచ్చాడు. అయితే ఈ వేడుకలో విశాల్‌ని చూసి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. అతడి మోహం వాచి ఉండడం.. మాట్లాడుతుంటే ఇబ్బంది పడ్డ తీరు.. వణకడం చూసి ఏమైందని అందోళన చెందారు.
తాజాగా ఈ విషయంపై ఖుష్బూ మాట్లాడుతూ.. విశాల్ ఈవెంట్‌కి వచ్చిన రోజు డెంగీ ఫీవర్‌తో భాదపడుతున్నట్లు తెలిపింది. 103 డిగ్రీల జ్వరం ఉన్న కూడా ఈవెంట్‌కి వచ్చాడని.. అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు అని తాను విశాల్‌ను అడిగినట్లు చెప్పింది. అయితే విశాల్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకే రావాలి అనుకున్నట్లు విశాల్ అన్నట్లు ఖుష్బూ చెప్పుకోచ్చింది. మరోవైపు డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న విశాల్ అపోలో హాస్పిటల్లో చికిత్స కొనసాగుతున్నట్టు సమాచారం. విశాల్‌కు డాక్టర్లు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.