Jaragandi Song composing with Artificial intelligence | ప్రపంచలో ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎక్కడ ఒక దగ్గర దీని సేవలు అందుకుంటున్నారు. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌లో ఒక పాట కంపోజ్ చేశాం అని చెప్పాడు సంగీత దర్శకుడు థమన్.
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోకి ఒక పాటకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి పాటను కంపోజ్ చేసినట్లు థమన్ వెల్లడించాడు. ఈ సినిమాలోకి జరగండి, జరగండి(Jaragandi) పాటను ఏఐ(AI)తో కంప్లీట్ చేశాం. మొదట ఈ పాటను దలేర్ మెహందీ(Daler Mehendi)తో మొదట పాడించాం. కానీ అయనతో పాడించినప్పుడు గట్టిగా పాడలేకపోయారు. బాద్షా సినిమాలోని ‘బంతి పూల జానకీ’ పాడింది ఆయనే.. అయితే అంతా ఎనర్జీ ఇప్పుడు ఆయన దగ్గర లేదు. దీంతో నాకు తెలిసిన ఒక సింగర్‌తో ఈ పాట పాడించి.. అది ఏఐలో వేసి దలేర్ మెహందీ పాడినట్లు క్రియేట్ చేశాం. కానీ అసలు పాడింది సింగర్ హన్మాన్ అంటూ చెప్పుకోచ్చాడు.