BISON | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా నటించిన చిత్రం బైసన్ (Bison). కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 24న విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్‌కు మూవీ లవర్స్ ఫిదా అయిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారి కోసం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 21 నుంచి తమిళం, తెలుగుతోపాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ కానుంది బైసన్. అయితే దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. పశుపతి, రజిష విజయన్, అమీర్, లాల్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందించాడు.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్