Amaravathi Aahwanam|తెలుగులో థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కే సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంటుందని తెలిసిందే. ఇదే లైన్లోథ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో భయపెట్టించేందుకు వస్తోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం (Amaravathiki Aahwanam). ధన్య బాలకృష్ణ, ఎస్తర్ నోరోన్హా, శివ కంఠమనేని, సుప్రిత, హరీష్, అశోక్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
జీవీకే దర్శకత్వంలో సీట్ ఎడ్జ్ హార్రర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. కీటక మరణం కప్ప జీవనాధారం.. కప్ప మరణం పాము జీవనాధారం.. ఈ సృష్టి మొత్తం జనన మరణ పోరాటం. ఇది ఒక యుద్దం.. ఒకరి గెలుపు మరొకరి అంతం.. అంటూ ధన్య బాలకృష్ణ పదునైన ఆయుధంతో ఎవరినో అంతం చేస్తూ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఇటీవల కాలంలో విడుదలైన హార్రర్ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఇదే తరహాలో మంచి ఆర్టిస్టులతో థ్రిల్లింగ్ అనిపించే కథ, కథణంతో సాగే ఈ సినిమాకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ జే ప్రభాకర్ రెడ్డి విజువల్స్, హనుమాన్ ఫేం సాయి బాబు తలారి ఎడిటింగ్ హైలెట్‌గా నిలుస్తాయని ఈ సందర్భంగా డైరెక్టర్ జీవీకే అన్నాడు. పద్మనాబ్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హార్రర్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసేలా సాగుతాయని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చెప్పారు మేకర్స్.
చాలా కాలం క్రితం లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. లీడ్ యాక్టర్ల ముఖాలను పూర్తిగా రివీల్ చేయకుండా డార్క్ షేడ్స్‌లో చూపిస్తూ క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. లీడ్ క్యారెక్టర్లంతా బ్లాక్ డ్రెస్‌లో సీరియస్‌గా కనిపిస్తుండగా.. డైరెక్టర్ సస్పెన్స్ స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు ఈ లుక్‌తోపాటు తాజా గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
Kaagitham Padavalu | శర్వానంద్ చేతుల మీదుగా ‘కాగితం పడవలు’ టీజర్ లాంచ్.. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ!
Battle of Galwan | బర్త్‌డే స్పెషల్.. సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజర్ విడుదల