Battle of Galwan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ (Battle of Galwan) నుంచి తాజాగా టీజర్‌ను నేడు విడుదల చేశారు. ఈ టీజర్లో సల్మాన్ ఖాన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక సీరియస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన నటన చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, గల్వాన్ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది (అయితే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది). టీజర్లో ‘చావుకి భయం ఎందుకు.. అది ఎలాగైనా వస్తుంది’ అనే డైలాగు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది.
ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా.. సల్మాన్ ఖాన్ సరసన చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తోంది. హిమేష్ రేషమియా సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.