Kaagitham Padavalu Trailer |టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ తాజాగా ‘కాగితం పడవలు’ చిత్ర టీజర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్ మరియు నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు.
టీజర్ విడుదల సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ప్యాషన్‌తో సినిమా తీసిన దర్శకుడు తుకారాంను అభినందించారు. టీజర్ చాలా నిజాయితీగా, ఆసక్తికరంగా ఉందని, హీరో వర్ధన్ తన మొదటి సినిమా అనిపించకుండా అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. “ప్రేమ నిప్పులాంటిది.. అది జీవితానికి వెలుగునిచ్చే దీపం అవ్వచ్చు లేదా దహించే కార్చిచ్చు కావచ్చు” అనే డైలాగ్‌తో సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, AIS. నౌఫల్ రాజా అందించిన నేపథ్య సంగీతం మరియు రుద్రసాయి విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం. హిమ బిందు పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ పనులను పీఆర్వో తేజస్వి సజ్జా నిర్వహిస్తున్నారు.

Kaagitham Padavalu Team with Sharwanand