Dhanush | యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న సెలబ్రిటీల్లో ఒకరు ధనుష్. ఇటీవలే ఇడ్లీ కడై సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. కాగా ధనుష్ నటిస్తోన్న హిందీ ప్రాజెక్ట్ తేరే ఇష్క్ మే నవంబర్‌లో విడుదల కానుంది. ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కాంబోలో మూడోసారి వస్తోన్న ఈ చిత్రంలో కృతిసనన్ హీరోయిన్గా నటిస్తోంది.
కాగా ఈ సినిమా విడుదల కాకముందే మరో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. Por Thozhil ఫేం విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధనుష్ 54. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేశాడట ధనుష్. అంతేకాదు ఈ మూవీని 2026 ఫిబ్రవరిలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
ఇదే నిజమైతే ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనుండటం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలు చేసే విషయంలో ధనుష్ స్పీడును చూసిన అభిమానులు షాకవుతున్నారు.
HYDRAA | రేవంత్ రెడ్డి పక్కా దొంగనే.. నిప్పులు చెరిగిన హైడ్రా బాధితురాలు
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్