Thiru Movie On Ott | కోలీవుడ్ హీరో ధనుష్‌కు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆదరిస్తుంటారు. ఈ క్రమంలోనే ధనుష్ ఇటీవలే నటించిన ‘తిరుచిత్రంబలం’ మూవీ తిరు పేరుతో ఇక్కడ కూడా రిలీజైంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాకుండా ధనుష్‌కు వంద కోట్ల కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ చిత్రం గత రాత్రి నుండి ‘సన్ ఎన్ఎక్స్టీ’లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంతో సౌత్‌లో ధనుష్‌కు మంచి పాప్యులారిటీ వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. ధనుష్‌కు జోడీగా రాశీఖన్నా, నిత్యామీనన్, ప్రియా భవాని శంకర్లు హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కీలకపాత్రలో నటించాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనురుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
ప్రస్తుతం ధనుష్ నటించిన ‘నానే వరువెన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్స్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నాడు. దీనితో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘సార్’ డిసెంబర్ 2న విడుదల కానుంది. ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also:
SS Rajamouli | హాలీవుడ్ ఏజెన్సీతో జక్కన్న డీల్..టాలీవుడ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేనా..?
NC22 Movie | నాగచైతన్య సినిమాలో ‘జైభీమ్’ టెక్నీషియన్..!
Rajinikanth | షారుఖ్ ‘జవాన్’లో సూపర్‌స్టార్ రజినీకాంత్?