Chenna kesava reddy Movie Re-Release | ఈ మధ్య టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోల బర్త్‌డే సందర్భంగా బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన పాత సినిమాలను 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ అయి మంచి కలెక్షన్లను కూడా సాధించాయి. ఇక ఇప్పుడు బాలయ్య సినిమా కూడా రీ-రిలీజ్ కానుంది. బాలకృష్ణ- వి. వి వినాయక్ కాంబోలో వచ్చిన ‘చెన్నకేశవ రెడ్డి’ అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యూయల్ రోల్లో బాలకృష్ణ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 25నాటికి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
కాగా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తుంది. యూ.ఎస్‌లో ఈ చిత్రం ప్రీ బుకింగ్స్‌తోనే ఏకంగా 25వేల డాలర్లను వసూళ్ చేసి.. మహేష్ బాబు ‘పోకిరి’ రికార్డును బ్రేక్ చేసింది. పోకిరి సినిమా రీ-రిలీజ్ టైంలో 15వేల డాలర్లను వసూళ్ చేసింది. ఇక చెన్నకేశవ రెడ్డి చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే పోకిరి రికార్డును బ్రేక్ చేసిందంటే బాలయ్యకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఇదే రేంజ్లో దూసుకుపోతే పవన్ కళ్యాణ్ ‘జల్సా’ రికార్డు కూడా బ్రేక్ అవడం ఖాయం అని నెటీజన్లు భావిస్తున్నారు. ‘జల్సా’ సినిమా యూ.ఎస్ బాక్సాఫీస్ దగ్గర మొత్తంగా 37వేల డాలర్లను వసూళ్ చేసింది. ఇక ఇప్పటికే చెన్నకేశవ రెడ్డి చిత్రం 25వేల డాలర్లను వసూల్ చేసింది. మరో 12వేల డాలర్లను సాధిస్తే జల్సా రికార్డు బ్రేక్ అయినట్లే. ఇక ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 300లకు పైగా థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. రీ-రిలీజ్‌తో వచ్చిన డబ్బులను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చారిటీకి ఇవ్వబోతున్నట్లు బెల్లంకొండ సురేష్ బాబు ఇటీవలే వెల్లడించాడు.
Read Also:
Allu Studios | అల్లు స్టూడియోస్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..లాంఛింగ్‌కు ప్రత్యేక అతిథి..!
SS Rajamouli | హాలీవుడ్ ఏజెన్సీతో జక్కన్న డీల్..టాలీవుడ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేనా..?
Thalivu Movie | ‘AK61’ సెకండ్ పోస్టర్ రిలీజ్.. మాస్ లుక్‌లో అదరగొడుతున్న అజిత్
Rajinikanth | షారుఖ్ ‘జవాన్’లో సూపర్‌స్టార్ రజినీకాంత్?