NC22 Movie Cinematographer | యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఇటీవలే వచ్చిన ‘థాంక్యూ’ చిత్రం ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన ‘మానాడు’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ విడుదల కాగా.. దీనికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా చిత్రబృందం ఈ మూవీ సినిమాటోగ్రాఫర్‌ను ప్రకటించింది.
ఈ చిత్రానికి ‘జైభీమ్’, ‘కతు వాకుల రెండు కాదల్’ వంటి సినిమాలకు పనిచేసిన ఎస్.ఆర్ కతీర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘ధూత’ వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది. ఈ వెబ్‌సీరీస్‌లో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు.
Read Also:
Rajinikanth | షారుఖ్ ‘జవాన్’లో సూపర్‌స్టార్ రజినీకాంత్?
Indian-2 Movie | కమల్ హాసన్ ‘ఇండియన్-2’ షూటింగ్ పునః ప్రారంభం.. ఫోటోస్ వైరల్
Naga Shaurya | ఆ స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసా..!
Liger Movie | ‘లైగర్’ చిత్రంతో పూరి జగన్నాధ్ అన్ని కోట్లు నష్టపోయాడా?