Indian-2 Movie | కమల్ హాసన్ ‘ఇండియన్-2’ షూటింగ్ పునః ప్రారంభం.. ఫోటోస్ వైరల్
Indian-2 Movie Shooting Begin | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శంకర్-కమల హాసన్ కాంబో ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.
Indian-2 Movie Shooting Begin | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శంకర్-కమల హాసన్ కాంబో ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమా వచ్చి 21 ఏళ్ళు అవుతున్నా ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఈ మూవీపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. కాగా ఇప్పుడు ‘ఇండియన్-2’ తెరకెక్కడానికి సిద్ధమైంది. అయితే గతంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ శంకర్‌కు, నిర్మాతలకు మధ్య బడ్జెట్ సమస్యలు రావడంతో షూటింగ్ ఆగిపోయింది. కాగా తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
‘ఇండియన్-2’ షూటింగ్ గురువారం ప్రారంభమైనట్లు కమల్ హాసన్ అధికారంగా ప్రకటించాడు. అంతేకాకుండా శంకర్‌తో షూటింగ్ స్పాట్లో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్‌జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఏ.సుభాస్కరణ్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ స్వర కల్పనలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘Rc15’ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లను శంకర్ ఏకకాలంలో జరుపనున్నాడు.
#Indian2 from today.
@Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE— Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022
Read Also:
Rajinikanth | షారుఖ్ ‘జవాన్’లో సూపర్‌స్టార్ రజినీకాంత్?
Jabardasth | రాకింగ్ రాకేష్‌తో పెళ్లి కన్ఫర్మ్ చేసిన జబర్దస్త్ లేడీ కమెడియన్..!
Dhamaka Movie | షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ధమాకా’.. వైరల్ అవుతున్న వీడియో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

