Dhanush | కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ రాంజానా, అట్రాంగి రే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రానికి తేరే ఇష్క్ మే (Tere ishk mein) టైటిల్‌ను ఫైనల్ కూడా చేశారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించి డబుల్ అప్డేట్స్ అందించారు మేకర్స్.
ఈ చిత్రంలో ముందుగా తృప్తి డిమ్రి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్నట్టు పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కృతిసనన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. అంతేకాదు ఈ చిత్రాన్ని నవంబర్ 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోలో రోడ్డుపై జరుగుతున్న అల్లర్లలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే.. మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తూ తనను తాను కాల్చుకునే ప్రయత్నం చేయడం చూడొచ్చు. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సారి ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నట్టు తాజా వీడియో చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రానికి హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. టీ సిరీస్-కలర్ యెల్లో సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృషన్ కుమార్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Jahan ishq ka junoon ho, wahan kahani alag hoti hai! ❤️🔥
Welcoming @kritisanon to the #WorldOfRaanjhanaa as MUKTI in #TereIshkMeinhttps://t.co/uymKjmKt6J@dhanushkraja @kritisanon @arrahman @aanandlrai #BhushanKumar #KrishanKumar #HimanshuSharma @neerajyadav911 @Irshad_kamil… pic.twitter.com/1ONs901Ae5— T-Series (@TSeries) January 28, 2025
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి