క్లాస్, మాస్ సినిమాలు చేస్తూ కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సార్ (Sir). ఈ మూవీ తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. 2023 ఫిబ్రవరిలో సార్ విడుదల కానుందంటూ అప్డేట్ చక్కర్లు కొడుతుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
సార్ చిత్రంలో సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సార్ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ధనుష్ మరోవైపు అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Also : Hello Meera Trailer | ఇంట్రెస్టింగ్గా గార్గేయి ఎల్లాప్రగడ హలో..మీరా ట్రైలర్.. లాంఛ్ చేసిన వివి వినాయక్
Read Also :Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లు కొత్త అప్డేట్.. పవన్ కల్యాణ్‌పై షూటింగ్ !
Read Also : Vivek Ranjan Agnihotri | కశ్మీర్ ఫైల్స్ మేకర్స్‌తో సుకుమార్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్