Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లు కొత్త అప్డేట్.. పవన్ కల్యాణ్‌పై షూటింగ్ !
ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్‌పై ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా షూటింగ్‌పై ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ కథనాల ప్రకారం పవన్ కల్యాణ్ రామోజీఫిలింసిటీలో హై ఆక్టేన్ యాక్షన్ సీన్ల షూటింగ్లో పాల్గొంటున్నాడు.
1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేశాడట క్రిష్. సినిమాకే మెయిన్ హెలైట్గా నిలిచేలా ఈ యాక్షన్ పార్టు ఉండబోతుండటంతో.. మేకర్స్ కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ ఈ యాక్షన్ సీన్లలో మునుపెన్నడూ లేని విధంగా న్యూ అవతార్‌లో కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హరిహర వీరమల్లు చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కల్యాణ్-క్రిష్-కీరవాణి టీం షూటింగ్ కోసం వర్క్ షాప్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

