Aishwarya Rajesh | ఉబెర్ మహిళా డ్రైవర్‌తో ఫొటో.. ఐశ్వర్య రాజేశ్ రియాక్షన్ ఇదే
గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న రోల్స్ చేస్తూ చాలా మంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). ఈ బ్యూటీ టైటిల్ రోల్ చేస్తున్న మూవీ డ్రైవర్ జమున (Driver Jamuna).
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న రోల్స్ చేస్తూ చాలా మంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ బ్యూటీ టైటిల్ రోల్ చేస్తున్న మూవీ డ్రైవర్ జమున (Driver Jamuna). లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో క్యాబ్ డ్రైవర్ జమున పాత్రలో నటిస్తోంది ఐశ్వర్య రాజేశ్.
డ్రైవర్ జమున తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో నవంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఐశ్వర్య రాజేశ్. ఓ వ్యక్తి మహిళా క్యాబ్ డ్రైవర్‌తో దిగిన ఫొటోను నెట్టింట పోస్ట్ చేశాడు. నా కోసం నా స్నేహితుడు ఉబెర్‌ను బుక్ చేసినప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి ఈ మహిళ వచ్చింది. రైడ్ మొదలైన తర్వాత, ముందు సీట్లో నిద్రపోతున్న చిన్నారిని.. మేడమ్, ఆమె మీ కూతురా? అని నేను అడగకుండా ఉండలేకపోయాను..అంటూ రాహుల్ శశి అనే వ్యక్తి షేర్ చేసిన పోస్ట్‌ను ట్యాగ్ చేసింది ఐశ్వర్యారాజేశ్.
#DriverJamuna హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ..వావ్.. నేను కూడా కొంత సంబంధం కలిగి ఉన్నా..అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.
Wow 🤩 something i cud relate wit #DriverJamuna https://t.co/tTcecc5Jih
— aishwarya rajesh (@aishu_dil) November 4, 2022
డ్రైవర్ జమున ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

