Raayan | బిగ్ స్క్రీన్లను బద్దలు కొట్టేందుకు రెడీ.. ధనుష్ రాయన్ ఈవెంట్ వివరాలివే
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రాయన్ (Raayan). నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Raayan | ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఊపిరాడకుండా చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ధనుష్ త్వరలోనే రాయన్ (Raayan)గా సందడి చేయబోతున్నాడు. స్వీయ దర్శకత్వంలో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇటీవలే ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టింది రాయన్ టీం. తాజాగా రాయన్ ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి. రాయన్ బిగ్ స్క్రీన్లను బద్దలు కొట్టేందుకు వస్తున్నాడు. రాయన్ ఆడియో లాంచ్ జులై 6న గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. చెన్నైలోని శ్రీరామ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఈవెంట్ జరుగనుంది. దీనిపై మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే రాయన్ ఫస్ట్ లుక్‌తోపాటు ఎస్జే సూర్య, హీరో ధనుష్ స్టన్నింగ్ లుక్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈవెంట్లో ఈ మూవీ థర్డ్ సింగిల్‌ను కూడా లాంచ్ చేయనున్నారట. రాయన్‌లో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీ రోల్స్ చేస్తున్నారు. డీ50వ (D50)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది.
#Dhanush‘s #Raayan updates & Promotions to kick start with the Grand Audio Launch to be held in Sai Ram engineering college 🎶💣
Announcement expected soon⌛ pic.twitter.com/fnNGKCggo8
— AmuthaBharathi (@CinemaWithAB) July 3, 2024
Read Also :
Coolie | పాపులర్ టెక్నీషియన్‌తో లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ కూలీ తాజా వార్త ఇదే
Atlee | అంతకు ముందే గెస్ట్ రోల్.. కీర్తిసురేశ్-అట్లీ సినిమాలో సల్మాన్ ఖాన్..!
Kamal Haasan | కమల్ హాసన్ ఇండియన్ 2కు సూపర్ క్రేజ్.. ఐమాక్స్ వెర్షన్ రెడీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

