Jana Sena : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన (Jana Sena) పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ ఇంచార్జీ ఎన్.శంకర్ గౌడ్ (N. Shankar Goud) తెలిపారు. త్వరలోనే ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రతి జనసైనికుడు, వీర మహిళ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం శేరిలింగంపల్లి నియోజయకవర్గంలోని హఫీజ్‌పేట డివిజన్ నుంచి డాక్టర్ మాధవ రెడ్డితో పాలు పలువురు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశాన్ని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలకమైన జనసేన ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారిస్తోంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నందున.. పార్టీని విస్తరించాలనుకుంటోంది. అందులో భాగంగానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తెలంగాణలో ఆ పార్టీ ఇంచార్జి ఎన్.శంకర్ గౌడ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తెలంగాణలో జనసేన పార్టీలో భారీగా చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి దిశగా జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సిద్ధాంతలకు పనిచేయాలని అనుకుంటున్న నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో చేరడానికి స్వాగతం తెలుపుతున్నాము అని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని… pic.twitter.com/zUXkTmGr0E
— JanaSena Telangana (@JSPTelangana) January 10, 2026