DIW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) దారుణ ఓటమి చవిచూసేలా ఉంది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరుతున్నారు. నికోలా కారీ(3-22) విజృంభణతో ఒకే ఓవర్లో డేంజరస్ షఫాలీ వర్మ(8), లారా వొల్వార్డ్త్(9)లు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. ఆ వెంటనే కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(1) సైతం వికెట్ కీపర్ చేతికి చిక్కింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే మరినే కాప్(10) సైతం వికెట్ ఇచ్చేసింది.
నాలుగో సీజన్ డబ్ల్యూపీఎల్ ఆరంభ పోరులో కంగుతిన్న ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్‌లో పంజా విసురుతోంది. బ్యాటర్లు భారీ స్కోర్ అందించగా.. బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఓపెనర్ లిజెల్లే లీ(10)ని నాట్ సీవర్ బ్రంట్ ఔట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బంతి అందుకున్న నికోలా కారీ(3-22) ఒకే ఓవర్లో షఫాలీ వర్మ(8), లారా వొల్వార్డ్త్(9)లను బౌల్డ్ చేసి ఢిల్లీని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్(1) ఔటయ్యింది. స్లిప్‌లో బౌండరీ కోసం తను కట్ షాట్ ఆడగా వికెట్ కీపర్ కమలిని కుడివైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా బంతిని అందుకుంది. దాంతో. .33కే ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయింది.
That is an INCREDIBLE take! 😲
🎥 17-year-old G Kamalini takes a special catch diving to her right 🫡
Updates ▶️ https://t.co/aVKBHVKp7c #TATAWPL | #KhelEmotionKa | #MIvDC pic.twitter.com/fbjAkVQoH8
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
ఢిల్లీని గట్టెక్కించాలనుకున్న మరినే కాప్(10) ఒక సిక్సర్, ఫోర్ బాది క్రీజులో నిలబడేలా కనిపించింది. కానీ, కారీ ఓవర్లో తను కూడా క్యాచ్ ఇచ్చి డగౌట్ చేరింది. అంతే.. 46కే సగం వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. ప్రస్తుతం నిక్కీ ప్రసాద్(9 నాటౌట్), చిన్నెల్లె హెన్రీ(7 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు స్కోర్.. 61-5.
Timber Strike✖️ 2⃣
Nicola Carey outfoxes Shafali Verma and Laura Wolvaardt in the same over \|/ 😮
Updates ▶️ https://t.co/aVKBHVKp7c #TATAWPL | #KhelEmotionKa | #MIvDC pic.twitter.com/6FOdMbPDny
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026