Idly Kadai | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై (IdlyKadai). DD4గా వస్తోన్న ఈ చిత్రాన్ని ఆకాశ్ (డెబ్యూ) తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా పొంగళ్ కానుకగా స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు.
ఒక పోస్టర్లో ధనుష్, నిత్యమీనన్ చేనులో నిలబడి వర్షంలో తడిసి ముద్దవుతుండగా.. మరో పోస్టర్లో తెలుపు రంగు చొక్కా, లుంగీలో మర్రి చెట్టు కింద లేగదూడను పట్టుకొని కూర్చున్నాడు. ఈ రెండు సినిమాలు సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తిరు సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ మూవీలో అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ధనుష్ దీంతోపాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేరలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. ధనుష్ మరోవైపు హిందీలో రాంజానా, అట్రాంగి రే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో తేరే ఇష్క్ మే (Tere ishk mein) సినిమాను కూడా చేస్తున్నాడని తెలిసిందే.
#IdlyKadai Pongal Special Poster..🔥 A Rural Feel Good Drama from Director #Dhanush Loading..🤙 April 10 Release..✅ pic.twitter.com/GUWFxlz35Z
— Laxmi Kanth (@iammoviebuff007) January 13, 2025
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు