Dhamaka Movie Runtime | మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం మాస్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత ‘ఖిలాడీ’, ‘రామా రావు ఆన్ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ సినిమాపైనే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా తెరకెక్కని ఈ చిత్రానికి త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా లెంగ్త్‌ను మేకర్స్ చాలా వరకు తగ్గించినట్లు తెలుస్తుంది. కేవలం 2గంటల 10నిమిషాల్లోపే ఈ సినిమా రన్‌టైం ఉండనుందట. అయితే ఇంత తక్కువ రన్‌టైం ఈ సినిమాకు ఒకింత ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్‌టైంతో హిట్-2 మాత్రమే వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందింది. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో బాణీలు సమకూర్చాడు.
Read Also:
ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..!
అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి అజిత్ సినిమా.. ఆ మూడు సినిమాలతో పోటీని తట్టుకుంటుందా?
Matti Kusthi Movie | టాక్ బాగున్నా.. సినిమా మట్టిలోనే కలిసిపోయిందిగా.. పాపం రవితేజ..!
Pooja Hegde | పూజా హెగ్డే కారణంగానే మహేష్-త్రివిక్రమ్ సినిమా ఆలస్యమవుతుందా?