అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి అజిత్ సినిమా.. ఆ మూడు సినిమాలతో పోటీని తట్టుకుంటుందా?
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి. ఈ పండగను టాలీవుడ్ ఇండస్ట్రీ వారు సినిమా పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తెలుగు సినిమాలకు సంక్రాంతి అనేది పెద్ద సీజన్. అందుకే సంక్రాంతి కోసం పెద్ద పెద్ద హీరోలు పోటీ పడుతుంటారు.
Thunivu Movie | సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి. ఈ పండగను టాలీవుడ్ ఇండస్ట్రీ వారు సినిమా పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తెలుగు సినిమాలకు సంక్రాంతి అనేది పెద్ద సీజన్. అందుకే సంక్రాంతి కోసం పెద్ద పెద్ద హీరోలు పోటీ పడుతుంటారు. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రూపొందుతుంటాయి. సంక్రాంతికి రెండు, మూడు సినిమాలు రిలీజైన అవి బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక టాలీవుడ్ సినిమాలతో పాటు అనువాద చిత్రాలు కూడా చుట్టం చూపుగా ప్రతీ సంక్రాంతికి వస్తుంటాయి.
ఇప్పటికే ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’ సినిమాలు సంక్రాంతికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాయి. కాగా తాజాగా మరో సినిమాకు సంక్రాంతి టిక్కెట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అజిత్ ‘తునివు’ సినిమాకు తాజాగా టిక్కెట్ ఓకే అయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ‘తెగింపు’ పేరుతో రాధాకృష్ణ ఎంటర్టైనమెంట్స్ నిర్వాహకులు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే సంక్రాంతి సీజన్‌ను బుక్ చేసుకున్న మూడు సినిమాలు థియేటర్ల దొరక్క ఇబ్బంది పడుతుంటే, ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా చేరడంతో థియేరట్లలో సందిగ్ధత నెలకొంది.
దిల్‌రాజు నిర్మించిన ‘వారసుడు’ సినిమా సంక్రాంతికి పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అయన తన సర్కిల్లో ఉన్న థియేటర్లను బుక్ చేసుకున్నాడు. ఇక ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు మిగిలిన థియేటర్లు పంచుకోనున్నాయి. ఇక ఇప్పుడు ‘తునివు’ కూడా రావడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. అయితే ఈ సినిమాకు వంద వరకు మాత్రమే థియేటర్లకు దక్కనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సిటీలలోనే ఈ సినిమా ఎక్కువగా ప్రదర్శితం కానుందట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మూడు కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. కాగా ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి బజ్ లేదు. అసలు ఈ సినిమా ఉందన్న విషయమే తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియదు. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారంటే రిస్క్ అనే చెప్పాలి. మరీ ఆ మూడు సినిమాల పోటీను తట్టుకుని తునివు నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

