December Second Week Releases | ఈ సంవత్సరం చివరి దశకు వచ్చేసింది. మరో నాలుగు వారాల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాదిలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు చూశాం. అలాగే ఎన్నో ఫేయిల్యూర్స్ను చూశాం. హిట్లు, ఫ్లాప్‌లు పక్కన పెడితే ప్రతీ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి పలు సినిమాలు ముస్తాబవుతూనే ఉంటాయి. అన్ సీజన్‌గా పిలవబడే నవంబర్ నెల ఈ సారి టాలీవుడ్‌కు బాగానే కలిసి వచ్చింది. యశోద, మసూద, లవ్ టుడే వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ విజయాలు సాధించాయి. అదే జోష్‌తో హిట్-2తో డిసెంబర్ నెల స్టార్ట్ అయింది. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం ఏకంగా 17సినిమాలు రిలీజ్‌కు పోటీ పడుతున్నాయి. మరీ ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం
గుర్తుందా శీతాకాలం:
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన లవ్ మాక్‌టైల్‌కు రీమేక్‌గా తెరకెక్కంది. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
పంచతంత్రం:
బ్రహ్మనందం , శివాత్మిక రాజశేఖర్, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న పంచతంత్ర సినిమా డిసెంబర్9న రిలీజ్ కానుంది. చిత్రబృందం రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలే నెలకొల్పాయి.
ముఖచిత్రం:
విశ్వక్ సేన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లాయర్‌గా కనిపించనున్నాడు.
ప్రేమదేశం:
త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. డియర్ మేఘ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. పైగా చిత్రబృందం రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి.
విజయానంద్:
ఈ మధ్య ఎక్కడ చూసిన కన్నడ సినిమాల హవానే కనిపిస్తుంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతీ చోట కన్నడ సినిమాలకు విశేష అధరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే మరో కన్నడ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. నిహాల్ రాజ్‌పుత్, భారత్ బోపన్నా, అనంత్ నాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 9న రిలీజ్ కానుంది.
డేంజరెస్:
డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్సర రాణి, నైనా గంగూళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇండియాలో తోలి లెస్బియన్ సినిమాగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు యూత్‌లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.
వీటితో పాటుగా ప్రేమదేశం రీ-రిలీజ్, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్ జీ, రాజయోగం, ap 04 రామాపురం, ఐ లవ్ యూ ఇడియట్, మనం అందరం ఒక్కటే, , సివిల్ ఇంజనీర్, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు:
అమెజాన్ ప్రైమ్ :
బ్లాక్ ఆడమ్-డిసెంబరు 10
జీ5 :
మాచర్ల నియోజకవర్గం(తెలుగు)-డిసెంబరు9
బ్లర్ (హిందీ)- డిసెంబరు 9
మాన్సూన్ రాగా (కన్నడ) -డిసెంబరు 9
సోనీలివ్ :
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ (తెలుగు)- డిసెంబరు 9
రాయ్ (మలయాళం)- డిసెంబరు 9
ఫాదూ (హిందీ సిరీస్)-డిసెంబరు 9
విట్నెస్ (తమిళ్ చిత్రం)- డిసెంబరు9
నెట్‌ఫ్లిక్స్ :
నజర్ అందాజ్ (హిందీ)-డిసెంబరు4
సెబాస్టియన్ మానిస్కాల్కో: ఈజ్ ఇట్‌మి (హాలీవుడ్)- డిసెంబరు6
ది ఎలిఫెంట్ విస్పరర్స్ (తమిళ్)- డిసెంబరు8
క్యాట్ (హిందీ సిరీస్)-డిసెంబరు9
మనీ హైస్ట్: కొరియా జాయింట్ ఎకనామిక్ ఏరియా (వెబ్‌సిరీస్2)-డిసెంబరు9
ఆహా:
ఊర్వశివో రాక్షసివో (తెలుగు)-డిసెంబరు9. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
డిస్నీ+హాట్‌స్టార్:
మూవింగ్ విత్ మలైకా (వెబ్‌సిరీస్)- డిసెంబరు5
కనెక్ట్(కొరియన్ సిరీస్)- డిసెంబరు7
ఫాల్ (తమిళ్)- డిసెంబరు9.