గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 00:10:59

పదికోట్ల వీక్షణలు

పదికోట్ల వీక్షణలు

పంజా వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకుడు. విజయ్‌సేతుపతి కీలక పాత్రధారి. ఈ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట వంద మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చిన ఈ గీతాన్ని జావెద్‌ అలీ ఆలపించారు. శ్రీమణి, రఖీబ్‌ ఆలమ్‌ సాహిత్యాన్ని అందించారు. చిత్రబృందం మాట్లాడుతూ ‘శావ్యమైన ఈ రొమాంటిక్‌ గీతం వంద మిలియన్ల వ్యూస్‌ సాధించడం ఆనందంగా ఉంది.  ఈ పాటలో నాయకానాయికలు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి కెమిస్ట్రీ, వారు కనిపించిన విధానం ఆకట్టుకుంటున్నది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ పుట్టినరోజున ఈ మైలురాయిని చేరుకోవడం మా సంతోషాన్ని రెట్టింపు చేసింది.  నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత థియేటర్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు. 


logo