అతడి మ్యూజిక్ కు చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు స్టెప్పులేయాల్సిందే. సినీ ప్రేక్షకులకు ఎన్నో మ్యూజికల్ హిట్ ఆల్బమ్స్ అందించి రాక్ స్టార్ గా మారిపోయాడు. ఆగస్టు 2న బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) బర్త్ డే . దేవీ శ్రీ ప్రసాద్ తన పుట్టినరోజును స్పెషల్ ప్లేస్ లో జరుపుకున్నాడు. విజయవాడ, గన్నవరంలోని డాడీస్ హోం (అనాథాశ్రమం) కు వెళ్లాడు డీఎస్పీ. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారుల మధ్య తన పుట్టినరోజు (Birthday) జరుపుకున్నాడు.
నా పుట్టినరోజు సందర్భంగా విజయవాడ, గన్నవరంలోని అందమైన ప్రదేశానికి వచ్చాను. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుని వందలాది చిన్నారుల యోగక్షేమాలు చూసుకునే డాడీస్ హోం (Daddys Home) ను సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఏ పాపం తెలియని చిన్నారులకు వెలకట్టలేని సేవలు చేయడం నా హృదయాన్ని తాకింది. నేను సర్ప్రైజ్ గా అక్కడికి వెళ్లి చిన్నారుల కోసం ప్రదర్శన ఇవ్వడంతో ఎప్పుడూ లేని అటాచ్ మెంట్ పెరిగింది. కొంతమంది చిన్నారులను స్పాన్సర్ చేస్తున్నానని మీతో షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సేవలు కొనసాగుతాయి.
చిన్నారులకు అవసరమైన నిత్యావసరాలు, ఇతర వస్తువులు అందజేశాను. డాడీస్ హోంకు సపోర్టుగా నిలుస్తూ తన ఛారిటీ వర్క్ తో నాలో స్పూర్తిని నింపిన శ్రావ్య వర్మకు ధన్యవాదాలు. చిన్నారులకు కావాల్సిన ప్రేమాభిమానాలకు వారికిద్దాం..అంటూ తన బావోద్వేగ పూరిత సందేశాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నాడు డీఎస్పీ.
THANK YOU ALL 4 d AMAZING LOVE on my BDAY🙏💕
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 2, 2021
On dis occasion I want 2 share about this BEAUTIFUL PLACE called DADDY’S HOME in GANNAVARAM, VIJAYAWADA, that takes care of Hundreds of abandoned children🙏💕
Pls Read the NOTE..https://t.co/vt57cMWpkM@sagar_singer @shravyavarma pic.twitter.com/v031dTb8eU
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్