Devara – Chuttamalle | అగ్ర హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రబృందం. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌ను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల్లే (Chuttamalle) అనే సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో తారక్, జాన్వీలు రొమాంటిక్ లుక్‌లో అలరిస్తున్నారు.
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.
The countdown to our breezy charttopper begins! 🦋💕#DevaraSecondSingle today at 5:04PM 💥#Chuttamalle #DheereDheere #Paththavaikkum #SwaathimuttheSikkangaithe #KanninathanKamanottam
Dominating the charts is a sure thing 😎
An @AnirudhOfficial Musical 🎶 #Devara… pic.twitter.com/QBEtquc0wr
— Naga Vamsi (@vamsi84) August 5, 2024
Also read..
KTR | స్వయంగా ముఖ్యమంత్రే ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. తామేమీ తక్కువకాదనేలా పోలీసులు: కేటీఆర్
Nandhyal | దుస్తులు విప్పదీసి.. రహదారిపై ఈడ్చుకెళ్లి.. విద్యార్థులపై తాగుబోతుల దాడి
Manjummel Boys | ఇళయరాజాకు రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్.?