IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలం అబుదాబి వేదికగా రసవత్తరంగా సాగుతున్నది. 77 స్లాట్స్ కోసం భారత, విదేశీ క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు సాగిన వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరాన్ గ్రీన్ అత్యధికంగా రూ.25.20 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా కోసం పలు జట్లు పోటీపడ్డాయి. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ ఫాస్ట్ బౌలర్ కోసం ఢిల్లీ, లక్నో జట్లు పోటీపడ్డాయి. ఇరు జట్లు రూ.13కోట్ల వరకు వెళ్లాయి. మధ్యలో కేకేఆర్ సైతం ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో సీఎస్కే సైతం ఆసక్తిని మళ్లీ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపింది.
రూ15కోట్లకు బిడ్ వేసింది. కేకేఆర్ రూ.16కోట్లకు కొనుగోలు బిడ్ వేసింది. అయితే, లక్నో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోల్‌కతా రూ.18కోట్లకు వేలంలో దక్కించుకొని తమ జట్టులో చేర్చుకుంది. ఐపీఎల్ వేలంలో ఇప్పటికే కామెరూన్ గ్రీన్‌ను రికార్డు ధరకు దక్కించుకున్న కేకేఆర్ తాజాగా.. శ్రీలంక ఫాస్ట్బౌలర్ను సైతం రూ.18కోట్లకు కొనుగోలు చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. మిచెల్ స్టార్క్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ డెత్ బౌలర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావించింది. దాంతో పతిరానా కోసం తీవ్రంగా పోటీ పడింది. డెత్ ఓవర్లలో పతిరానా దిట్ట. యార్కర్లు వేయడంలో స్పెషలిస్ట్. అందుకే ఈ లంక బౌలర్‌ను బేబీ మలింగగా పిలుస్తుంటారు. పతిరానా గతంలో చెన్నై తరఫున నిలడగా రాణించాడు. మతీషా పతిరానా ఐపీఎల్లో 32 మ్యాచుల్లో 1016 పరుగులు చేయడంతో పాటు 47 వికెట్లు పడగొట్టాడు.