Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకీ మరింతగా పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి’ పాట ప్రేక్షకులు, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అందించిన క్యాచీ ట్యూన్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రామ్ చరణ్ ఎనర్జిటిక్ ప్రెజెన్స్, స్టైలిష్ హుక్ స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఈ స్టెప్స్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్స్, వీడియోలతో ట్రెండింగ్‌లో నిలిపారు. దీంతో ‘చికిరి’ పాట నిజంగా ఒక సెన్సేషన్‌గా మారింది.
ఇక వ్యూస్ పరంగా కూడా ఈ సాంగ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం తెలుగులోనే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం. అన్ని భాషలను కలుపుకుని చూస్తే 150 మిలియన్‌కు పైగా వ్యూస్ అందుకుని, రామ్ చరణ్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచింది. ఈ రికార్డులు ‘పెద్ది’ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయనకు జోడిగా అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని హంగులు సమకూర్చుకుని తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి ‘చికిరి’ పాటతోనే రామ్ చరణ్ మరోసారి తన మాస్ పవర్‌ను నిరూపించగా, ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ ఈ సినిమా బజ్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో కూడా షూట్ చేసే అవకాశముందని యూనిట్ వర్గాలు తెలియజేశాయి. జనవరి చివరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగించి, అప్పటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా కొనసాగిస్తూ సినిమా వర్క్‌ఫ్లోను వేగవంతం చేస్తున్నారు.