Kalyan Ram | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు నందమూరి కళ్యాణ్ రామ్. ఓ వైపు నటుడిగా.. మరోవైపు నిర్మాతగా కొనసాగుతూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న చిత్రం దేవర (Devara). జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తారక్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
కాగా కళ్యాణ్ రామ్ దేవర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. నాకు దేవర గేమ్ ఆఫ్ థ్రోన్స్ (పాపులర్ ఇంగ్లీష్ సిరీస్) కంటే పెద్దది. దేవర భారతీయ సిల్వర్ స్క్రీన్‌పై ఉత్తమంగా ఉంటుంది. ఈ సినిమా కోసం మేమంతా 40 అడుగుల లోతులో ట్యాంక్‌ను తవ్వి.. నీటి అడుగుభాగంలో వచ్చే సన్నివేశాలను చాలా విస్తృతంగా చిత్రీకరించాము. గత ఏడాది కాలంగా దేవర తప్ప మరే సినిమాలో పని చేయని సాబు సిరిల్ వేసిన సెట్పీస్ చూస్తే మీరతా ఆశ్చర్యపోతారు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కష్టం దేవర సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందంటూ చెప్పుకొచ్చాడు.
దేవరలో సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తున్నాడు. జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు