Demonte Colony 2 | కోలీవుడ్ నుంచే వచ్చే హారర్ చిత్రాలకు తెలుగులో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తమిళం నుంచి వచ్చి తెలుగులో చంద్రముఖితో పాటు, పిజ్జా, కాంచన, అరణ్మనై సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించాయి. అయితే ఇదే జానర్లో తమిళంలో వచ్చిన మరో చిత్రం ‘డెమోంటే కాలనీ'(Demonte Colony). నటుడు అరుల్ నిధి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం 2015లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌ను కూడా తెరకెక్కించారు మేకర్స్. ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) అంటూ ఈ సినిమా రాగా.. అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో నటించారు. ఫస్ట్ పార్ట్‌కు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.
గత నెల విక్రమ్ తంగలాన్ సినిమాతో పోటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’లో ఈ నెల 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
The darkness rises again, and vengeance awaits 🌑🦇 #DemonteColony2 will be streaming from 27th September only on ZEE5 in Tamil & Telugu@BTGUniversal @AjayGnanamuthu @arulnithitamil @priya_Bshankar @ActorMuthukumar @SamCSmusic @Archana_ravi_ #DemonteColony2OnZEE5… pic.twitter.com/hz24p8Ajh5
— ZEE5 Tamil (@ZEE5Tamil) September 16, 2024
Also Read..