Amit Shah: మోదీ సర్కారుతో రాజకీయ స్థిరత్వం: అమిత్ షా
Amit Shah: మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఇవాళ మాట్లాడారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. అమిత్ షాతో పాటు మంత్రులు అశ్వినీ వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాలనలో సాధించిన ప్రగతిపై రూపొందించిన ఓ బుక్‌లెట్‌ను అమిత్ షా ఆవిష్కరించారు.
పదేళ్ల అభివృద్ధి, భద్రత, సంక్షేమం తర్వాత ప్రజలు మూడవ సారి బీజేపీ మిత్ర కూటమిని మరోసారి ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు. గడిచిన 60 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఇది దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని, పాలసీలను సమర్థవంతంగా అమలు చేశామన్నారు. ప్రధాని మోదీ తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంలో.. ప్రాచీన, ఆధునిక విద్యా వ్యవస్థలు ఉన్నట్లు తెలిపారు. ఆ విద్యా వ్యవస్థ ప్రాంతీయ భాషలను గౌరవిస్తుందని హోంమంత్రి తెలిపారు.
వంద రోజుల పాలన సమయంలో.. సుమారు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో ఇండ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలో ఇండ్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

