షాపింగ్‌మాల్, జర్నీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రాజోలు భామ అంజలి. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను సాగిస్తోంది. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది. అంజలి ప్రస్తుతం వకీల్‌సాబ్ చిత్రంలో నటిస్తోంది.
ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది వకీల్‌సాబ్. ఈ హీరోయిన్ సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న ఫొటోలు ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తున్నాయి. యెల్లో కలర్ శారీ, గ్రే బ్లౌస్ లో ఉన్న అంజలి అందానికే కేరాఫ్ అడ్రస్‌లా నిలిచిపోతుంది. వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన అంజలి.. చీరకట్టులో కెమెరాకు పోజులిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫొటోలు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.