Deepika Padukone | బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె (Deepika Padukone) గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు దీపిక తాజాగా చెప్పుకొచ్చింది. 8, 9 నెలల్లో చాలా కష్టంగా అనిపించినట్లు తెలిపింది. ఆ సమయంలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనతోనే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
తన కూతురుకి దువా అనే పేరు ఎందుకు పెట్టారో కూడా వివరించింది దీపిక. బేబీకి పెరు పెట్టే విషయంలో తాము తొందరపడలేదని వివరించింది. బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పేరు పెట్టినట్లు చెప్పింది. ‘ముందుగా బేబీ క్షేమంగా మా చేతుల్లోకి రావాలనే కోరుకున్నాం. దువా అనే పేరు కూడా అనుకోకుండా పెట్టేశాం. అరబిక్ భాషలో దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టాం’ అని దీపికా చెప్పుకొచ్చింది.
‘రామ్ లీలా’ అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణవీర్ సింగ్, దీపికా పదుకొణె. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి రామ్ లీలా తర్వాత, బాజీరావు మస్తానీ (Bajirao Mastani), పద్మావత్ (Padmaavat) సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలకు కూడా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించడం విశేషం. పెళ్లైన ఆరేళ్ల తర్వాత అంటే 2024 సెప్టెంబర్ 8 దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ తీసుకొని పూర్తి సమయం బేబీకి కేటాయిస్తోంది. అప్పుడప్పుడు పలు కార్యక్రమాల్లో దర్శనమిస్తూ సందడి చేస్తోంది.
Also Read..
Trump’s movie tariff | ట్రంప్ టారిఫ్స్‌తో టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్